- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి ఉంటే బాగుండేది: ఎస్పీ కోటిరెడ్డి
దిశ, కొత్తగూడ: గంగారం మండలం కోమాట్లగూడ గ్రామంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ కోటి రెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నిత్యం జరిగే అసాంఘిక కార్య కలాపాలు అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రజలు అన్నిటిలో ముందుండి పలు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, విద్య, ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరారు. మారు మూల ప్రాంత ప్రజలు సరైన వసతులు లేక పట్టణాలకు వెళ్లి ఆసుపత్రులలో చూయించుకోలేక ఇబ్బందులు పడుతుంటారని గుర్తు చేశారు.
సీజనల్ గా వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తారని, ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జిల్లా స్థాయి వైద్యాధికారుల ప్రొద్భలంతో తాము మారు మూల ప్రాంతాల ప్రజలందరికి వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజా సేవలో ముందంజలో నడుస్తూ పోలీసు వృత్తిలో ఉన్నామన్నారు. అలాగే మాపై ఏజెన్సీ ప్రాంత ప్రజలు చూపించిన ఆదరణకు చలించామని, ఈ ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి ఉంటే బాగుండేది అన్నారు.
వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ..ఎస్సై చంద్ర మోహన్
ఉన్నత అధికారుల ఆదేశానుసారం పోలీసులు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలు పొందిన వారికి, తమ అమూల్య మైన సమయాన్ని వెచ్చించి వైద్య సేవలు అందించిన వైద్యాధికారులకు, గ్రామస్థులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్సై చంద్ర మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య శిబిరంలో దాదాపు వెయ్యి మందికి పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందజేశారు.