ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై మధుసుదన్

by Shyam |
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై మధుసుదన్
X

దిశ, వనపర్తి: పట్టణ ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వనపర్తి టౌన్ ఎస్ఐ మధుసుదన్ కోరారు. శనివారం వనపర్తి పట్టణ రహదారుల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్ మేట్లు, మాస్కులు ధరించని 60 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. రాష్ట్రంలో ఒమిక్రోన్ వైరస్ వేరియంట్ కేసులు నమోదు అయినందున, వైరస్ వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలందరూ తప్పనిసరిగా మార్కులు ధరించాలని, లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీ లలో రెండవ ఎస్ ఐ మమత, ట్రాఫిక్ ఏఎస్ ఐ నిరంజన్, పోలీస్ సిబ్బంది మహేష్, ఆంజనేయులు,నర్సింహ్మ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed