మావోయిస్టు తల్లికి అండగా.. పోలీసులు..!

by Shyam |
maoist mother police
X

దిశ‌, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన సెరిపల్లి రాయపోశమ్మను పరామర్శించి ఆమెకు నిత్యావసర సరుకులను అందజేశారు డీఎస్పీ సంపత్ రావు, సీఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సెరిపల్లి రాయపోశమ్మ కుమారుడు అయిన సెరిపల్లి సుధాకర్ 2002వ సంవత్సరంలో తన కుటుంబంను వీడి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళినాడని, అప్పటి నుండి ఇప్పటి వరకు తన కుటుంబాన్ని చూడటానికి ఇంతవరకు రాలేదని, అట్టి బాధతో తన తల్లి అనారోగ్యం పాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు, డీఎస్పీ సెరిపల్లి రాయపోశమ్మకు అండగా ఉండి నిత్యవసర వస్తువులను అందజేశారు.

మునుముందు కూడా ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ వారి తరుపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా సెరిపల్లి సుధాకర్ మావోయిస్టు పార్టీ నుండి జన జీవన స్రవంతిలో కలవాలని, పోలీసు డిపార్ట్మెంట్, ప్రభుత్వం నుండి తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో మావోయిస్టు పార్టీలో కేడర్ అంతా కరోనా బారినపడి మరణిస్తుoడంతో తన తల్లి రాయపోశమ్మ ఏడుస్తూ ‘లొంగి పో బిడ్డ నేను ఎక్కువ రోజులు బతకలేను కడచూపు నన్ను చూసుకో బిడ్డ కొడుకా’ అంటూ సెరిపల్లి సుధాకర్ ఆట్టి పార్టీని వీడి తన దగ్గరికి వచ్చి ఉండాలని డీఎస్పీ ముందు మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో డీఎస్పీ రాయ పోశమ్మకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సామాగ్రిని అందజేశారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story