రేపు ఈ బ్రిడ్జిలపైకి అనుమతించరు

by Shyam |
రేపు ఈ బ్రిడ్జిలపైకి అనుమతించరు
X

దిశ,వెబ్‌డెస్క్: జీరో డే సందర్భంగా డిసెంబర్ 31న నగరంలో పలు ఆంక్షలను పోలీసు శాఖ విధించింది. గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో వాహనాల రాక పోకలపై ఆంక్షలు విధించినట్టు పోలీసు శాఖ తెలిపింది. నగరంలోని సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవరిర్సటీ ఫ్లై ఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెనలను గురువారం మూసి వేయనున్నట్టు పేర్కొంది.

రేపు బేగంపేట ఫ్లై ఓవర్ మాత్రమే తెరచి ఉంటుందనీ..మిగతా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేయనున్నట్టు చెప్పారు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్ల పైకి కార్లను అనుమతించడం లేదని తెలిపారు. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జిల వద్ద వెహికిల్స్ దారిని మళ్లించనున్నట్లు చెప్పారు. కాగా ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేపు రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం 5గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.

Advertisement

Next Story