మా వివాదంలో మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

by Shyam |   ( Updated:2021-10-17 00:18:03.0  )
maa news
X

దిశ,వెబ్‌డెస్క్ : మా వివాదంలో మరో ట్విస్ నెలకొంది. మా ఎన్నికల సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్‌కు తాళం వేసి షాకిచ్చారు. మా పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమ‌పై దాడి చేశారంటు ప్రకాశ్ రాజ్ తెలిపిన విషయం తెలిసిందే. నరేష్ ఇతరులు తమపై దాడి చేశారంటున్న ప్రకాష్ రాజ్.. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయన్నాయని ఎన్నికల అధికారికి లేఖ రాశారు. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరగా.. అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్. దీంతో ప్రకాశ్ రాజ్ సీసీ ఫుటేజ్‌ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు.

Advertisement

Next Story