బాలికపై అత్యాచారం.. కేసు నమోదు చేయని పోలీసులు..!

by Sumithra |
బాలికపై అత్యాచారం.. కేసు నమోదు చేయని పోలీసులు..!
X

దిశ, మంగపేట : మంగపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఐదు రోజుల క్రితం లైంగికదాడికి పాల్పడ్డ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. యువకుడు బాలికను మభ్యపెట్టి లెంగిక దాడికి పాల్పడ్డట్లు తెలిసింది. బాలికకు తీవ్ర రక్త స్రావం కావడంతో తల్లి గమనించి ప్రశ్నించగా విషయం చెప్పింది. దీంతో మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. కాగా కేసు నమోదైతే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని మధ్యవర్తులు బాలిక తల్లిదండ్రులను భయపెడుతన్నట్లు తెలిసింది. కాగా, బాలికపై లైంగిక దాడి జరిగి ఐదు రోజులవుతున్నా కేసు నమోదు కాలేదు.

Advertisement

Next Story