- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్ : మోసం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. అందుకే 18 మంది యువకులను మోసం చేసింది ఓ యువతి. యువకులకు గాలం వేసి పెళ్లాడడం, అనంతరం నగలతో పరారవ్వడం భాగ్‌వతి అలియాస్ అంజలి లక్షణం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిది. చివరికి రాజస్థాన్ పోలీసులకి చిక్కింది.
తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న ఈ అంజలితోపాటు మరో ఐదుగురిని జునాగఢ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ముఠా పలువురిని మోసగించినట్లు పోలీసులు చెబుతున్నారు. యువకులను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారివద్ద ఉన్న నగలు, నగదుతో పారిపోవడం వీరి పనిగా తెలుస్తోంది. జునాగఢ్ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడిన యువతి… నగలు, మూడు లక్షల నగదుతో పరారైంది.
తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి బాగోతం బయటపడింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ముఠా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. అంజలి, ఆమె తల్లి ధనుబెన్‌లను పోలీసులు అరెస్టుచేసి విచారించగా 18 మంది యువకులు వీరి చేతిలో మోసపోయినట్లు తెలిసింది. దీంతో వీరిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.