కరోనాపై పోలీసు కళా బృందం… వినూత్న ప్రచారం

by Shyam |   ( Updated:2020-08-24 09:09:35.0  )
కరోనాపై పోలీసు కళా బృందం… వినూత్న ప్రచారం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వహించాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ అన్నారు. సోమవారం కరోనాపై ప్రజలకు అవగహన కల్పించేందుకు పోలీసు శాఖకు చెందిన కళా బృందం జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టిందని ఆమె తెలిపారు.

ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేటలో కళా బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ… కరోనా వైరస్ ప్రాణాంతకం కాకపోయినా, ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని, తప్పని పరిస్థితుల్లో మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ, బయటకు రావాలని సూచించారు.

Advertisement

Next Story