ఇటలీ పర్యావరణ మంత్రితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ

by Mahesh |   ( Updated:2025-01-14 13:03:39.0  )
ఇటలీ పర్యావరణ మంత్రితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఈ రోజు.. ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ (Future Minerals Forum 2025) మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌(Ministerial Round Table Conference)లో పాల్గోన్నారు. సౌదీ అరేబియా(Saudi Arabia)లోని రియాద్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటలీకి చెందిన పర్యావరణ మరియు ఇంధన భద్రత మంత్రి గిల్బర్టో పిచెట్టో ఫ్రాటిన్‌(Gilberto Pichetto Fratin)తో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థిరమైన మైనింగ్ పద్ధతులు(Sustainable mining practices), పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో భారతదేశం-ఇటలీ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.


Advertisement

Next Story

Most Viewed