రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తొలివారం కలెక్షన్లు ఎన్నంటే?

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-18 16:06:46.0  )
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తొలివారం కలెక్షన్లు ఎన్నంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - సంచలన దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నది. తొలిరోజు రూ.186 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ విడుదల చేసి మరీ చెప్పింది. అయితే తర్వాతి రోజు నుంచి కలెక్షన్ల వివరాలను వెల్లడించలేదు. తాజాగా.. గేమ్ ఛేంజర్ తొలివారం కలెక్షన్ల(Game Changer Collections) వివరాలు బయటకొచ్చాయి. ఫస్ట్ వీక్ రూ.350 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్పన్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. చరణ్‌కు జోడిగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించిన‌ ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళ ద‌ర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) ఈ మూవీకి కథను అందించ‌గా.. స‌ముద్రఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌(Srikanth), అంజలి(Anjali), సునీల్‌, న‌వీన్ చంద్ర, త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10వ తేదీన విడుదలైంది.

Read More..

Ram Charan: అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్‌గా రామ్ చరణ్ కామెంట్స్


Next Story