Kids and Parenting : పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా..? జర భ్రదం!

by Javid Pasha |
Kids and Parenting : పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా..? జర భ్రదం!
X

దిశ, ఫీచర్స్: స్మార్ట్ ఫోన్.. ఎన్ని అద్భుతాలు చేస్తోందో తెలుసు కదా.. ! ప్రస్తుతం అది లేనిదే రోజు గడవట్లేదు ఎవరికి. పెద్దల వరకైతే పర్లేదు కానీ.. చివరికి చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతుండటమే ఇక్కడ సమస్య అంటున్నారు నిపుణులు. ఇది వారి ఆరోగ్యంపై, చదువులపై, ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పులకు కారణం అవుతోందని ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ సర్వే’ కూడా పేర్కొన్నది.

*అధ్యనంలో భాగంగా 12 నుంచి 16 ఏండ్ల లోపు పిల్లలపై స్మార్ట్ ఫోన్ ప్రభావాన్ని పరిశీలించిన నిపుణులు. ఇది వారి మానసిక స్థితిలో మార్పునకు కారణం అవుతుందని, ఒత్తిడి, ఆందోళనలకు దారితీస్తుందని పేర్కొన్నారు. దాదాపు 65 శాతం మంది పిల్లలు లేదా టీనేజర్లలో స్మార్ట్ ఫోన్ అతి వినియోగం స్ట్రెస్, యాంగ్జైటీలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కోపం, చికాకు, ఆందోళన కరమైన ప్రవర్తన, తరచుగా నిరాశ చెందడం వంటి సమస్యలు స్మార్ట్ ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో తలెత్తుతానయని నిపుణులు అంటున్నారు.

*అంతేకాకుండా ఫోన్ చూడటం ఒక వ్యసనంగా మారితే.. పదేళ్లలోపు పిల్లలు దానికోసం మారాం చేస్తారు. ఫోన్ ఇస్తేనే అన్నం తినడం, హోం వర్క్ చేయడం, పేరెంట్స్ చెప్పింది వినడం వంటివి చేస్తామని మొండికేసే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో పేరెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి?

పేరెంట్స్ తమ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తుంటే గనుక నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఫోన్ వారికి ఇవ్వకపోడం, అందుబాటులో ఉంచకపోవడం మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే.. స్ర్కీన్ టైమ్ (Screen time) తగ్గించం ద్వారా, పిల్లలకు ఫోన్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన పెంపొందించడం ద్వారా దాని వినియోగాన్ని అరికట్టవచ్చు. ఫోన్ చూసేకంటే గ్రౌండ్‌లో ఆడుకోవడం, పుస్తకం చదవడం, డ్రాయంగ్ వేయడం వంటి విషయాల్లో పిల్లను ప్రోత్సహించడం ద్వారా ఫోన్ వ్యవసనాన్ని తగ్గించవచ్చు.

Next Story

Most Viewed