- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భార్య మిస్సింగ్.. ఆ వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్న భర్త
by Kalyani |

X
దిశ, కొండపాక: వివాహిత మహిళ అదృశ్యమైన సంఘటన కుకునూర్ పల్లి మండల కేంద్రం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన కాలువ రాజేష్ తన భార్య కాలువ లైలా(27) తో కలిసి గత నెల 9వ తేదిన కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్ లో పని చేయడానికి వచ్చారు. గత నెల 28 వ తేదిన ఉదయం కాలువ లైలా భర్త కాలకృత్యాల కోసం వాష్ రూం కి వెళ్లి వచ్చి చూసే వరకు కనపడకుండా వెళ్ళిపోయింది. భర్త కాలువ రాజేష్ ఎక్కడ వెతికిన ఆచూకీ లభించక పోయేసరికి సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భార్య కనిపించకపోవాడికి కనకం సుమన్ పై అనుమానం వ్యక్తం చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story