- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘనంగా బండ మల్లన్న జాతర ఉత్సవాలు
దిశ, మిరుదొడ్డి : సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి, వీరారెడ్డి పల్లి గ్రామ శివారులో ప్రఖ్యాతిగాంచిన బండ మల్లన్న జాతర ఉత్సవాలు సంక్రాంతి పర్వదినాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బండ మల్లన్న దయతో రైతు సోదరులతో పాటు ప్రజలంతా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జాతరలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా ఎడ్ల బండితో బండ చుట్టూ ప్రదక్షణ చేశారు. కేసీఆర్ కృషి తోనే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కొని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు నిర్మించుకున్నామని, త్వరలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువు, కుంటలు, వాగు వంకలు నింపడం జరుగుతుందన్నారు. ఏటా సంక్రాతి పండుగ సందర్బంగా బండ మల్లన్న జాతర ఘనంగా జరుగుతుందని, వేల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొనడం జరుగుతుందన్నారు.