మావోయిస్టుల లేఖ కాదు బెదిరింపుల లేఖ : ఎస్పీ జానకి

by Kalyani |
మావోయిస్టుల లేఖ కాదు బెదిరింపుల లేఖ :  ఎస్పీ జానకి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ రాసిన లేఖ ఫేక్ అని, అది స్థానికులు రాసిన బెదిరింపు లేఖ అని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన షేక్ రఫీక్, కమ్మరి భగవంతు, అదే గ్రామానికి చెందిన షాద్ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ మహ్మద్ షా అలీ,షేక్ తవ్ ఫిక్ లు కలిసి షాద్ నగర్ లోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున ఒక లెటర్ ప్యాడ్ ను ప్రింట్ చేయించి బెదిరింపు లేఖను రాసి రంగారెడ్డి గూడ లోని చిత్తనూరి రవి కుమార్ ఇంటి గోడ పై ప్రజలకు కనిపించే విధంగా షేక్ తవ్ ఫిక్ అతికించారని ఆమె వివరించారు.

ఎన్నికలకు ముందు ఏ1 గా ఉన్న షేక్ రఫీక్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ,ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెంబడి ఉండేవాడని, అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఎలాంటి ఆర్థిక లాభం లేదని భావించి,బీఆర్ఎస్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే పై కోపం పెంచుకొన్నాడని తెలిపారు‌. ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్ధేశ్యంతో మిగతా ముగ్గురిని కలుపుకొని ఈ పన్నాగం పన్నినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని షేక్ రఫీక్ పై అనుమానం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్ లో విచారించగా,తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి నేతృత్వంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మూడు రోజుల్లోనే మహబూబ్ నగర్ పోలీసులు కేసును ఛేదించి మరోమారు తమ ప్రతిభను చాటుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల సీఐ నాగార్జున గౌడ్,కె.రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed