Makarajyothi Darshanam : శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం

by M.Rajitha |
Makarajyothi Darshanam : శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది(Makarajyothi Darshanam). శబరిమల(Shabarimala)లోని పొన్నాంబలమేడు(Ponnambalamedu) నుంచి భక్తులకు మకరజ్యోతి దర్శనం ఇవ్వడంతో.. శబరిగిరులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండగ(Sankranthi Festival) రోజున పొన్నాంబలమేడు కొండల నుంచి మకర జ్యోతి కనిపించడం పరిపాటి. మకరజ్యోతి దర్శనానికి కేరళ ట్రావెన్ కోర్ బోర్డ్(Kerala TravenCore Board), కేరళ ప్రభుత్వం(Kerala Govt) అన్ని ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. అయ్యప్పమాల ధరించిన వారు సంక్రాంతి వరకు శబరిమల చేరుకొని, దర్శనం కార్యక్రమాలు పూర్తి చేసుకొని మకర జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తారు. సరిగ్గా సాయంత్రం దీపాలు పెట్టేవేళకి ఓ జ్యోతి మూడుసార్లు కనిపించి మాయం అవుతుంది. దీనిని ప్రజలు మకరజ్యోతిగా, అయ్యప్పస్వామి మహిమగా చెప్పుకుంటారు.

అయితే పొన్నాంబలమేడు కొండల్లో ఉండే గిరిజనులు ప్రతిఏటా సంక్రాంతికి కింద శబరికొండల్లో ఉన్న అయ్యప్పస్వామికి పెద్ద కర్పూర హారతిని మూడుసార్లు పట్టేవారు. కాలక్రమంలో పలు రిజర్వాయర్స్ కోసం గిరిజనులను అక్కడి నుంచి పంపించి వేయగా.. ఆ ఆనవాయితీని ప్రభుత్వం తీసుకుంది. పండగరోజు మధ్యాహ్నం వరకు క్రూరమృగాలతో నిండిన దట్టమైన అడవిలో భారీ పోలీసు, అటవీ శాఖ సిబ్బంది, ఆలయ నిర్వహకులు పొన్నాంబలమేడు కొండలకు చేరుకొని, సాయంత్రంవేళలో కర్పూర మంట వేసి, మూడుసార్లు అడ్డుగా పరదా వంటిది వేస్తారు. అది కింద నుంచి చూస్తున్న వారికి ముడుసార్లు కనిపిస్తూ మాయమవుతున్న జ్యోతి మాదిరిగా ఉంటుంది. దీనిని భక్తులు మకరజ్యోతిగా భావించి నమస్కరిస్తారు. కాగా ఈ విషయం హైకోర్టుకు చేరగా.. మకరజ్యోతిపై అప్పట్లో దేశవ్యాప్త చర్చ కూడా నడిచింది. చివరికి మకరజ్యోతి కృత్రిమమే అని ప్రభుత్వం, ఆలయ బోర్డు కోర్టుకు తెలియ జేశాయి.

Advertisement

Next Story

Most Viewed