- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేరాలకు తగ్గ శిక్షలు పడేలా కృషి చేయాలి : ఎస్పీ జానకి

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : నేరాలు చేసిన నేరస్తులకు నేరానికి తగ్గ శిక్షలు పడేందుకు కృషి చేయాలని,అప్పుడే వారిలో పరివర్తన చెంది ఇకపై నేరాలు చేయకుండా మారుతారని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో కోర్టు డ్యూటీ అధికారులు,లైజన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.కేసుల విచారణలో పారదర్శకత,వేగం,న్యాయ ప్రక్రియలను సమర్దవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు.అలాగే కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ,సామన్లు,వారెంట్లు అమలు చేయడం,కేసుల నివేదికలను సమయానికి సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.అంతేకాకుండా పోలీసుల పనితీరును మెరుగు పరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు,సూచనలు,సలహాలను ఆమె వివరించారు.ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటేశ్వర్లు,రమణారెడ్డి,సుదర్శన్,తదితర సిబ్బంది పాల్గొన్నారు.