- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాంబు బెదిరింపు కేసుతో ఆప్‌కు లింకులు
- ఆరోపించిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో:
బాంబు బెదిరింపు కేసులో నిందితుడైన విద్యార్థితో ఆప్‌కు లింకులున్నాయని బీజేపీ ఆరోపించింది. ఇటీవల ఢిల్లీలోని 400 పైగా పాఠశాలలకు 12వ తరగతి విద్యార్థి బాంబు బెదిరింపు కాల్స్ చేశాడు. కాగా, ఆ విద్యార్థికి ఒక ఎన్జీవోతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సదరు ఎన్జీవో ఒక రాజకీయ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్పారు. సదరు ఎన్జీవో గతంలో పార్లమెంటుపై దాడి చేసిన కేసులో దోషిగా తేలి, ఉరిశిక్ష పడిన అఫ్జల్‌గురుకు మద్దతుగా మాట్లాడిందని పోలీసులు తెలిపారు. కాగా పోలీసులు వెల్లడించిన విషయాలను ఉటంకిస్తూ.. సదరు ఎన్జీవోతో సంబంధాలు ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీకేనని బీజేపీ ఆరోపిస్తోంది.
'ఆప్‌కు సదరు ఎన్జీవోతో లోతైన సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్జీవో గతంలో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే కాకుండా అఫ్జల్‌గురు చనిపోయిన తర్వాత వర్థంతి ఉత్సవాలు కూడా సదరు ఎన్జీవో నిర్వహించింది. కానీ ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం ఏనాడూ మాట్లాడలేదు. ఆ ఎన్జీవోలోని వ్యక్తులతో ఆప్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఢిల్లీ సీఎం ఆతిషి తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలన్న పిటిషన్‌కు మద్దతు ఇచ్చారు' అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది మంగళవారం నిర్వహించన విలేకరుల సమావేశం చెప్పారు.