కోర మీసాల స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం

by Sridhar Babu |
కోర మీసాల స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం
X

దిశ, భీమదేవరపల్లి : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరమీశాల వీరభద్రుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్వకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. కొత్తకొండ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఎల్ నాగరాజు ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుఫ్తా, ఈఓ కిషన్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టెం పెల్లి ఐలయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు చిదురాల స్వరూప, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్ మాడుగుల, ఎజ్రా బొజ్జపూరి అశోక్, ముఖర్జీ పొన్నాల మురళి, గజ్జెల రమేష్, గజ్జెల సురేష్, సిద్దమల్ల కృష్ణ, దూడల సంపత్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed