అప్రమత్తంగా ఉండి.. నష్టం జరగకుండా చూడాలి !

by Shyam |
అప్రమత్తంగా ఉండి.. నష్టం జరగకుండా చూడాలి !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి నష్టం కలుగకుండా చూడాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిస్థితులను డీజీపీ శనివారం రాత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని, అన్నిస్థాయిల్లో పోలీసులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటల సమీపంలో స్థానికుల సహాయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Next Story