నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు

by Sumithra |
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
X

దిశ, మహబూబాబాద్: నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి సోమవారం తెలిపారు. ఎస్పీ కోటి రెడ్డి వివరాల ప్రకారం… టాస్క్ ఫోర్స్, టౌన్ పోలీసులు సంయుక్తంగా మహబూబాబాద్ శివారులోని సాలార్ తండా వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు.

దీంతో వారి వద్ద తనిఖీ చేయగా రూ. 3,50,000 రూపాయల నకిలీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. మార్పిడి చేసేందుకు సిద్దంగా మరో ఏడుగురు… విషయం తెలుసుకుని పరారయ్యారు. వీరిలో మహేశ్, రామకృష్ణ, ఆకారపు వెంకన్న, రాందాస్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 3,50,00 నకిలీ నోట్ల కట్టలు, రెండు ద్వి చక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story