- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 వేలకు పైగా వాహనాలపై కేసులు
దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. రోడ్లపై తిరుగుతున్న 12 వేలకు పైగా వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం ఒక్క రోజే 1842 వాహనాలను సీజ్ చేయగా, 2962 వాహనాలపై కేసులు బుక్ అయ్యాయి. సీజ్ చేసిన వాహనాల్లో టూ వీలర్లు 1667, త్రీ వీలర్లు 71, ఫోర్ వీలర్లు 104 ఉన్నాయి. కేసులు నమోదైన వాటిలో ఎలాంటి డాక్యుమెంట్లు లేని వాహనాలు 911, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా డబుల్ రైడింగ్‌తో తిరుగుతున్న వాహనాలు 1391, సింగిల్ రైడింగ్ చేస్తున్న 660 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఒక్కరోజే సీజ్ అయినవి, కేసులు నమోదైనవి కలిపి మొత్తం 4804 వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మోటారు వాహనాల చట్టం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన మొత్తం 12 వేల 939 వాహనాలపై కేసులు బుక్ అయ్యాయి.
Tags : Lockdown, hyderabad traffic police, corona effect on riding vehicles