పాల కోసం బయటికొచ్చినందుకు చితకొట్టిన కానిస్టేబుల్

by Shyam |
పాల కోసం బయటికొచ్చినందుకు చితకొట్టిన కానిస్టేబుల్
X

దిశ నాగర్ కర్నూల్: అత్యవసర పనిమీద బయటికి వచ్చిన సామాన్యుడిపై పోలీస్ కానిస్టేబుల్ లాక్ డౌన్ నిబంధనల పేరుతో విచక్షణా రహితంగా లాఠీ ఝలిపించాడు. దీంతో సదరు వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. దీనిపై పోలీసు అధికారులను ఆశ్రయించి తనపై దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ గటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన కరణ్ అనే వ్యక్తి తన పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారని పాలకోసం స్కూటీపైన బయటకు వచ్చాడు. అటుగా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ తనను వెంబడించి శ్రీపురం రోడ్డు పట్టుకున్నాడు.

బయటికి రావడానికి గల కారణం చెప్పేలోగానే లాఠీతో విచక్షణారహితంగా చితక బాదాడని ఆరోపించాడు. ఈ దృశ్యాలు అక్కడే ఓ ఇంటివద్ద ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. చివరికి తీవ్ర గాయాలై లేవలేని స్థితిలో ఆస్పత్రి పాలైన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సదరు పోలీస్ కానిస్టేబుల్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed