గెస్ట్‌హౌస్‌లో అమ్మాయిలు.. సమాజంలో అరాచకాలు.. అతడెవరు..?

by Anukaran |   ( Updated:2021-03-10 13:38:57.0  )
గెస్ట్‌హౌస్‌లో అమ్మాయిలు.. సమాజంలో అరాచకాలు.. అతడెవరు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ గెస్ట్ హౌజ్ కేంద్రంగా జరిగిన తతంగం అంతా ఇంతా కాదు. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఆ అక్రమార్కునితో చేతులు కలిపి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినట్టు కరీంనగర్‌లో కథలు చెప్పుకుంటున్నారు. ఆ ఘనుడి గురించి ’దిశ‘ వెలుగులోకి తీసుకువచ్చిన తరువాత బాధితులు రహస్యంగా ఇస్తున్న సమాచారం అంతా ఇంతా కాదు. తమ పేరు మాత్రం బయటపెట్టకండి ప్లీజ్… ఆ కర్కోటకుడి దృష్టిలో పడితే అధికారుల అండదండలతో మమ్మల్ని నశం నలిపినట్టు నలిపేస్తాడు అంటూ ఓ వ్యక్తి భయం భయంతో చెప్పుకున్నాడంటే అతని ఆగడాలు ఎంతమేర పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. సదరు వ్యక్తితో చేయి కలిపిన ఓ పోలీసు అధికారి వింత చేష్టలు, వికృత కార్యకలాపాల గురించి చెప్తున్న తీరు చూస్తే ఔరా అనాల్సిందే.

ఆ ఘనుడు కొంతకాలం గెస్ట్ హౌజ్‌గా వాడుకున్న భవనంలోని స్విమ్మింగ్ ఫూల్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ మన్మథలీలలను తలపించారని కూడా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుండి అమ్మాయిలను రప్పించుకుని స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్ చేస్తుంటే యువతులతో పెగ్ కలిపి పోస్తూ కిస్‌లు ఇస్తుంటే ఆనందంలో తేలియాడారట. మద్యం మత్తు అమ్మాయితో మరింత కిక్కు వస్తుండడంతో ఆ పోలీసు అధికారి సదరు వ్యక్తికి పెద్దన్నలా మారిపోయాడని కరీంనగర్ అంతా కోడై కూస్తోంది.

అంతేకాదు, అతడు పోలీసుల అండదండలు చూసుకుని చేసిన అక్రమాలు అన్ని ఇన్నీ కావని అంటున్నారు స్థానికులు. ‘ఏరా ఏ పోలీసు అధికారికి చెప్తావో చెప్పుకో పో’ అంటూ దాడులు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 1970వ దశాబ్దంలో జరిగిన ఓ భూ లావాదేవీలు విషయంలో కూడా సదరు ఘనుడు పోలీసు అధికారి అండతో ఎఫ్ఐఆర్ చేయించేందుకు ఓ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు ఫోన్ చేయించుకున్నాడని తెలుస్తోంది. ఓ చోట భూమిని కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ విలువకు తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భూ యజమానిని బెదిరింపులకు గురి చేయడంతో బలహీనుడైన అతడు సైలెంట్‌గా రిజిస్ట్రేషన్ చేశాడట.

ఆఫీసర్స్ సీరియస్…

’దిశ‘ లో వచ్చిన వరస కథనాలతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారని సమాచారం. ఇంతకీ ఆ ఘనుడు ఎవరు? ఏం చేస్తాడు అతని అక్రమాలేంటి అన్న పూర్తి వివరాలపై నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నిఘా వర్గాలతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమగ్ర వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. అతనితో సంబంధాలు ఉన్న పోలీసు అధికారులు ఎవరు, రెవెన్యూ అధికారులు ఎవరు వారి ప్రమేయంతో ఏమేం అక్రమాలకు పాల్పడ్డాడు అన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. అతనితో పోలీసు అధికారులు ఎంత మేరకు పాత్రదారులు అయ్యారు, వారి పరోక్ష ప్రత్యక్ష్య సహకారం ఏంటి అన్న వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story