కాంగ్రెస్ ర్యాలీపై లాఠీచార్జ్.. దిగ్విజయ్ సింగ్ అరెస్ట్

by Shamantha N |   ( Updated:2021-01-23 05:11:04.0  )
కాంగ్రెస్ ర్యాలీపై లాఠీచార్జ్.. దిగ్విజయ్ సింగ్ అరెస్ట్
X

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైతుల ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీపై రాష్ట్ర పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైవర్ధన్ సింగ్, కునాల్ చౌదరిలను, పార్టీ కార్యకర్తలు, ఇతర ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది.

భోపాల్‌లోని జవహర్ చౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు ఈ మార్చ్ చేపట్టతలపెట్టారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం, లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నానని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. పోలీసుల దమనకాండలో మహిళా ఆందోళనకారులకూ గాయాలయ్యాయని, అయినప్పటికీ తాము రైతులకు తమ మద్దతును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా గతవారం కూడా కాంగ్రెస్ ఓ ర్యాలీ తీసింది.

Advertisement

Next Story

Most Viewed