దగ్గుబాటి సురేశ్ బాబుకి టోకరా వేసిన కేటుగాడు అరెస్ట్..

by Sumithra |   ( Updated:2021-06-23 04:44:53.0  )
దగ్గుబాటి సురేశ్ బాబుకి టోకరా వేసిన కేటుగాడు అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ పేరుతో నిర్మాత సురేష్ బాబుకు లక్ష రూపాయలు టోకరా వేసిన నాగార్జున రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కేటీఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, కరోనా టీకాలు ఇప్పిస్తానని నమ్మబలికిన నాగార్జున రెడ్డి.. సురేష్‌ బాబు మేనేజర్‌ నుంచి లక్ష రూపాయలు అకౌంట్‌లో వేయించుకుని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో సురేష్ బాబు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నాగార్జున రెడ్డి ని అరెస్ట్ చేశారు. నాగార్జున రెడ్డి ఇప్పటికే వ్యాక్సిన్ పేరుతో 10 మంది ప్రముఖులను మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఓ వస్త్ర దుకాణ వ్యాపారి వద్ద తెలంగాణ మంత్రి పేరుచెప్పి లక్షల్లో మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టు లో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story