ఫోన్లు దొంగతనం చేసి ఎక్కడ పెట్టారో తెలుసా..?

by Sumithra |
Mulugu Police
X

దిశ, ములుగు : దొంగతనం చేసి స్మార్ట్ ఫోన్లను కొట్టేసిన దుండగులు.. వాటిని అక్కడ పెట్టేసి మరో దొంగతనానికి యత్నించి పోలీసులకు చిక్కారు. 24 గంటల్లోనే జరిగిన ఈ చోరీ కేసు వివరాలను ములుగు ఎస్ఐ రంగకృష్ణ గురువారం మీడియాకు వెల్లడించారు.

ములుగు మండలం అచ్చాయిపల్లికి చెందిన కొందరు దుండగులు బుధవారం అర్ధరాత్రి వంటిమామిడిలోని శివసాయి మొబైల్ షాప్‌లో చోరీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న ఐదు స్మార్ట్ ఫోన్లను దొంగిలించి నిందితుల ఇంటి వెనక దాచిపెట్టారు. గురువారం ఉదయం తునికి బొల్లారంలో మరోసారి దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులను ఘటన స్థలంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. మొబైల్ షాపులో దొంగతనం చేసినట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ రంగకృష్ణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed