పోలీసుల చాకచక్యం.. అంతా అరగంటలోనే ఫినిష్..

by srinivas |
Mangalagiri Police Station
X

దిశ, వెబ్‌డెస్క్ : దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని మంగళగిరి పెదవడ్లపూడి మధ్య బుధవారం అర్ధరాత్రి రహదారిపై వచ్చే వారిని దోచుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే దారిలో
ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకున్న దోపిడీ ముఠా.. కత్తులు చూపించి అతడి నుంచి నగదు లాక్కున్నారు.

సదరు వ్యక్తి అక్కడి నుంచి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరగంటలోనే ఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు సభ్యులు ఉన్న దోపిడీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దారి దోపిడీలకు పాల్పడ్డారు? ఎంత మందిని దోచుకున్నారు అని విచారిస్తున్నారు. అలాగే వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసికునట్లు సమాచారం. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించడం లేదు.

Advertisement

Next Story