- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్ట మధుకు మళ్లీ నోటీసులు… మధ్యాహ్నం విచారణ
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుకు 41ఏ కింద మరోసారి నోటీసులు జారీచేశారు. మధ్యాహ్నం విచారించనున్నట్టు వారు తెలిపారు. హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో మధు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మధుతో పాటు ఆయన భార్య శైలజను కూడా రెండు రోజులు విచారించిన పోలీసులు. అలాగే మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాష్ ను కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. మధు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు సంబంధించిన 39 బ్యాంక్ అకౌంట్ లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2021 జనవరి 1 నుంచి ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నారు. ఎనిమిది బ్యాంక్ ల నుండి వివరాలు రాగా మరో 6 బ్యాంకుల నుండి వివరాలు ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
కన్ఫెషన్ లో లేకపోవడమా?
గట్టు వామన్ రావు హత్య కేసులో పుట్ట మధుపై అభియోగం మోపేందుకు అన్ని కోణాల్లో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలంలో ఎక్కడ కూడ పుట్ట మధు పేరు రాకపోవడం, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల్లో ప్రత్యక్ష్యంగా కానీ పరోక్షంగా కానీ పుట్ట మధు ప్రమేయం ఉన్నట్టు తేలనట్టుగా తెలుస్తోంది. దీంతో న్యాయ నిపుణల సలహా కూడా తీసుకునేందుకు రామగుండం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారి హైదరాబాద్ లోని లీగల్ ఎక్స్ పర్ట్స్ తో చర్చిస్తున్నట్టు సమాచారం.