కోడి పందేల్లో ప్రజాప్రతినిధులు

by Anukaran |
కోడి పందేల్లో ప్రజాప్రతినిధులు
X

దిశ, ఏపీబ్యూరో : ప్రభుత్వం నిషేధం విధించినా కోడి పందేలు జోరుగా మొదలయ్యాయి. ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో ప్రజల అభీష్టానికి భిన్నంగా ప్రజా ప్రతినిధులు కూడా కాదనలేకపోయినట్టుంది. అక్కడక్కడా వాళ్లూ ప్రత్యక్షంగా తిలకించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం పల్లెకోనలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. పందేలను ఎమ్మెల్యే మెరుగ నాగార్జున తిలకించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు, గుండాటలు జోరుగా జరుగుతున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, వీఆర్ పురం, మామిడికుదురు మండలాల్లో బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, ఏలేరు, నిడదవోలు, భీమవరం మండలాల్లో ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చోట్ల బరులు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజవర్గం కంకిపాడు మండలం ఉప్పలూరులో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కోడిపందేల శిబిరాలను కంకిపాడు, ఉయ్యురు, పెనమలూరు మండలాల సీఐలతో ఏసీపీ విజయ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed