నగరంలో కరువైన మానవత్వం.. స్పందించని పోలీసులు, 108 సిబ్బంది

by Shyam |
person
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జీవనం సాగిస్తుంటారు. ఉద్యోగం, వైద్యం తదితర అవసరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి రోడ్ల పక్కనే జీవిస్తుంటారు. అయితే, వారికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఎలాంటి షెల్టర్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా నగరంలో చాలా చోట్ల షెల్టర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి నాంపల్లి మెట్రో స్టేషన్ కింద లేవలేని స్థితిలో ఉన్నాడు. దీనిని గమనించిన ఓ వ్యక్తి.. అపస్మారక స్థితిలో, చాలా అత్యవసర స్థితిలో ఓ వ్యక్తి ఉన్నాడు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలంటూ జీహెచ్ఎంసీ, పోలీసు, మెట్రో అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఆయన ట్వీట్‌కు ఏ ఒక్క అధికారి స్పందించలేదు.

దీనిని ట్యాగ్ చేస్తూ ఎన్జీవోల సాయం కోసం ఎదురుచూడగా.. ఓ నెటిజన్ స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. కాళ్లకు గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. దీనిపై అధికారులు స్పందిచకపోవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed