పీఎన్‌బీ కుంభకోణంలో కీలక మలుపు!

by Sumithra |
Nirav Modi
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కేసులో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు నీరవ్‌మోదీ సోదరి పూర్వి మోదీ ఈడీకీ అప్రూవర్‌గా మారారు. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక వివరాలను గురువారం వెల్లడించారు. పూర్వి మోదీ యూకే బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి రూ. 17.5 కోట్లకు పైగా విలువైన నగదును బదిలీ చేసినట్టు ఈడీ వివరించిది. ఆమె లండంక్ అకౌంట్ నుంచి 23,16,889 డాలర్లను భారత ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఖాతాకు నగదు బదిలీ చేసినట్టు సంస్థ తెలిపింది. జూన్ 24న పూర్వి మోదీ పేరున యూకేలోని బ్యాంకు ఖాతా ప్రారంభించారని, తన సోదరుడు నీరవ్‌మోదీ ఆదేశాలను అనుసరించి అకౌంట్ ఓపెన్ చేసినట్టు, అందులోని నగదు తనది కాదని ఆమె ఈడీకి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆమెకు షరతులతో కూడిన క్షమాభిక్ష పెట్టింది.

షరతుల ప్రకారం.. ఆమె కేసుకు సంబంధించిన సమాచారం పూర్తిగా, ఖచ్చితమైన వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది జనవరి 4న పూర్వి మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతాలు బ్యాంకు మోసానికి సంబంధించి క్షమాపణలు కోరగా, ఈడీ దానికి మద్దతిచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈడీ దర్యాప్తులో సహాయం చేసేందుకు అంగీకరించడంతో వారిద్దరికీ ఉపశమనం లభించింది. కాగా, ముంబైలోని పీఎన్‌బీ బ్యాంకు బ్రాంచ్ నుంచి వజ్రాల వ్యాపారి నీర్వ్ మోదీ రూ. 13,700 కోట్ల మోసం చేసిన బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటినుంచి భారత ప్రభుత్వం అతన్ని అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనికి నీరవ్ మోదీ సవాల్ చేస్తూ అక్కడి హైకొర్టులో చేసుకున్న అప్పీల్‌ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story