- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PNB :ఆ ఖాతాల నుంచే పీఎన్‌బీకి రూ. 170 కోట్ల ఆదాయం..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు ఖాతాల్లో కనీస మొత్తాన్ని నిర్వహించనందుకు సుమారు రూ. 170 కోట్ల ఛార్జీలను వసూలు చేసింది. పీఎన్‌బీ బ్యాంకు ఛార్జీల రూపంలో వసూలు చేసిన ఆదాయంపై ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా బ్యాంకు వివరాలను వెల్లడించింది. వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా పీఎన్‌బీ అంతకుముందు 2019-20లో రూ. 286.24 కోట్లను వసూళ్లతో పోలిస్తే ఈసారి తగ్గాయి.
అలాగే, ఏటీఎం లావాదేవీ ఛార్జీల ద్వారా 2020-21లో రూ. 74.28 కోట్ల ఆదాయం సాధించగా, అంతకుముందు 2019-20లో రూ. 114.08 కోట్లను వసూలు చేసింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను మినహాయించినట్టు పీఎన్‌బీ పేర్కొంది. ఈ కారణంగానే బ్యాంకు ఆదాయం తగ్గినట్టు అభిప్రాయపడింది.