పదేళ్ల గరిష్ఠానికి ఉత్పత్తి కార్యకలాపాలు

by Harish |
పదేళ్ల గరిష్ఠానికి ఉత్పత్తి కార్యకలాపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 అంతరాయాల తర్వాత ఆర్థికవ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డిమాండ్ పుంజుకుని, ఉత్పత్తి పెరుగుతోంది. అక్టోబర్ నెలకు సంబంధించి ఉత్పత్తి కార్యకలాపాలు వేగంగా విస్తరించి పీఎంఐ ఆశాజనకంగా నమోదైనట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా తెలిపింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) అక్టోబర్‌లో 58.9 పాయింట్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఇది 56.8గా నమోదైంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. పీఎంఐ గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల కంటే ఎక్కువగా నమోదైతే వృద్ధిని సూచిస్తుంది. అంతకంటే తక్కువగా ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. దేశీయ ఉత్పత్తిదారులకు కొత్త ఆర్డర్స్ పెరుగుతున్నాయని, తద్వారా ఉత్పత్తి మెరుగ్గా ఉంటోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మొదలైన కరోనా సంక్షోభం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు కోలుకుంటున్నట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిక్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డి లిమా చెప్పారు.

Advertisement

Next Story