- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narendra Modi: కరోనా కొత్త సవాళ్లు విసురుతోంది: నరేంద్ర మోడీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కొత్త సవాళ్లు విసురుతోందని.. ఇలాంటి సమయంలోనే శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. గురువారం 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఏపీ అధికారులతో ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా జిల్లాల్లోని కరోనా పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త సవాళ్ల మధ్య కొత్త వ్యూహాలు, పరిష్కారాలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. స్థానిక అనుభవాలను ఉపయోగించాలని.. ఫీల్డ్ వర్క్ అనుభవాలు, ఫీడ్ బ్యాక్‌తో విధానాలు రూపొందించాలని సూచించారు. వ్యాక్సిన్ డ్రైవ్ విషయంలో రాష్ట్రాల సూచనలతోనే ముందుకెళ్తున్నామన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ వేస్టేజ్‌ను అరికట్టాలని సంబంధిత అధికారులను మోడీ ఆదేశించారు.