- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు అన్నిపార్టీల నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
దిశ, న్యూస్‌బ్యూరో: భారత్- చైనా సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో అన్నిపార్టీల నేతలతో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయా పార్టీల నేతల అభిప్రాయాలను క్రోడీకరించనున్నారు. ఒకటిన్నర నెల రోజులుగా లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైనికులు దూసుకువస్తున్నా ప్రధాని మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశంలో ప్రస్తావించడం, వివిధ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్సు జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఈ వీడియా కాన్ఫరెన్సులో పాల్గొంటున్నారు.
దేశ రక్షణ, భద్రత, ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని ప్రకటించారు. శుక్రవారం జరగనున్న వీడియో కాన్ఫరెన్సులో సైతం మరోమారు ఇదే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలోనే చైనా సైనికులు చొరబడుతున్నారన్న సమాచారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చినా ఇప్పటివరకూ వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను ప్రధాని తీసుకోలేదన్న విమర్శలు ఇటీవల వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఘర్షణ జరిగి భారత సైనికులు చనిపోయిన తర్వాత కూడా ప్రధాని చాలా ఆలస్యంగా స్పందించారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అన్నిపార్టీల అభిప్రాయాలను ఈ వీడియోకాన్ఫరెన్సులో తీసుకోనున్నారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.