బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ ట్వీట్

by Anukaran |   ( Updated:2020-10-28 01:29:13.0  )
బీహార్ ఓటర్లకు ప్రధాని మోదీ ట్వీట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
బీహార్ తొలి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓటర్లకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. కొవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ట్వీట్ వేదికగా కోరారు. కాగా, బీహార్‌లోని 71 స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.

Advertisement

Next Story