గుడ్‌ఫ్రైడే‌పై ప్రధాని మోడీ కామెంట్

by Shamantha N |
గుడ్‌ఫ్రైడే‌పై ప్రధాని మోడీ కామెంట్
X

న్యూఢిల్లీ: గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీసస్‌ను స్మరించారు. జీసస్ క్రైస్ట్ చేసిన త్యాగాలు, ఆయన కష్టాలను గుడ్‌ఫ్రైడే జ్ఞప్తికి తెస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దయాస్వభావానికి ప్రతిరూపం అని వివరించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి, అవసరార్థులకు ఆపన్నహస్తం అందిస్తారని జీసస్‌ను కొలుస్తారు అని ట్వీట్ చేశారు. ఇటీవలే కేరళ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీసస్‌ను ప్రస్తావించారు. వెండి కోసం యూదులు జీసస్‌ను మోసం చేసినట్టే బంగారు కడ్డీల కోసం విజయన్ సర్కారు కేరళ ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. కేరళలో ఈ నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed