భారత్ కు ఐరాస పెద్ద పీట వేయాలి

by Anukaran |   ( Updated:2020-09-26 08:40:08.0  )
భారత్ కు ఐరాస పెద్ద పీట వేయాలి
X

దిశ వెబ్ డెస్క్ :
ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ శనివారం ప్రసంగించారు. ఈ సందర్బంగా ఐక్యరాజ్య సమితికి 75వ వార్షికోత్సవ శుభాకాంక్షలను మోడీ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఏంటనేది ఆలోచించాలని ఆయన సూచించారు. ఇప్పుడు సరికొత్త సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని అన్నారు. కాబట్టి ఐరాసలో తక్షణ సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. 21వ శతాబ్దం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఆ మార్పులు ఉండాలని ఆయన సూచించారు. కాలానుగుణంగా మార్పులకు సిద్దం కావాలని ఆయన సూచించారు.

ఐక్యరాజ్య సమితిలో భారత్ కు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. భారత్ ఎప్పుడూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం పని చేస్తుందన్నారు. భారత్ పై నమ్మకం ఉంచినందుకు ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2025వరకు క్షయ వ్యాధిని భారత్ నిర్మూలిస్తుందని ఆన్నారు.

Advertisement

Next Story

Most Viewed