- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలారా చూడండి.. మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రైతులకు మద్దతుగా పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 విపక్షాల పార్టీలు సంయుక్త ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక “భారత్ మరింత బలపడటానికి కోవిడ్ సంక్షోభం మరింత ఉపయోగపడిందని చెప్పారు. కనిపించని శత్రువుతో అలుపెరుగని యుద్ధం చేస్తున్నాం. మన దేశం మరింత బలపడటానికి కరోనా సంక్షోభం ఉపయోగపడింది. ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. ప్రపంచలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతుంది. కరోనా పై పోరాటంలో ఇతర దేశాలకు సహకరిస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఇతర దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. దేశానికి కరోనా వారియర్స్ చేసిన సేవ వెలకట్టలేనిది. ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని కరోనా వారియర్స్ ” పై ప్రధాని మోడీ ప్రసంశల వర్షం కురిపించారు.