MSP కంటిన్యూ.. ప్రధాని స్పీచ్ అడ్డగింత.. కాంగ్రెస్ వాకౌట్!

by Shamantha N |
MSP కంటిన్యూ.. ప్రధాని స్పీచ్ అడ్డగింత.. కాంగ్రెస్ వాకౌట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ బుధవారం లోక్‌సభలో సమాధానం చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం 130కోట్ల మంది భారతీయుల మనోభావాలకు అద్దం పట్టిందని, దేశప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. మరో పాతికేళ్లలో మనదేశం అత్యున్నత స్థాయిలో నిలబడాలని ప్రధాని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రపంచ ఆశాకిరణంగా భారత్ నిలిచింది. కరోనా వేళ ప్రపంచ దేశాలకు మనం మార్గదర్శకంగా మారామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేయగా.. మోడీ అగ్రి చట్టాలను మరోసారి సమర్థించుకున్నారు. కనీస మద్దతు ధర(MSP) కొనసాగుతుందని ఆయన లోక్‌సభలో స్పష్టంచేశారు. ప్రధాని సమర్థన సందర్భంగా.. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed