పీఎం షేర్ చేసిన వీడియో : బయటకెళ్తే కరోనా గెలుస్తుంది.. డాడీ

by Shamantha N |
పీఎం షేర్ చేసిన వీడియో : బయటకెళ్తే కరోనా గెలుస్తుంది.. డాడీ
X

న్యూఢిల్లీ : కరోనా పై యుద్దానికి సన్నద్ధమవ్వాలి అంటూ స్ఫూర్తిదాయకమైన వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో కరోనా కట్టడికి ఉపక్రమించిన ఒక చిన్నారి తన తండ్రికి రాస్తున్న లేఖ గురించిన వివరణ ఉన్నది. 40 సెకండ్ల ఆ వీడియోలో చిన్నారి రాస్తున్న విషయం వాయిస్ ఓవర్ లో వినపడుతుంది. ‘ప్రియమైన నాన్న.. నేను నిన్ను మిస్ కావడం లేదు. అమ్మ కూడా మిస్ కావడం లేదు. ఇప్పటికిప్పుడు నువ్వు ముంబై నుంచి పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నారో.. అక్కడే ఉండండి. అడుగు బయట పెడితే కరోనా గెలుస్తుంది. కానీ మనం కరోనా ని ఓడించాలి కదా నాన్న..’ అని ఆ చిట్టి తల్లి తన తండ్రికి సందేశాన్ని పంపుతుంది. కరోనా పై పోరుకు స్ఫూర్తినిస్తున్న ఈ వీడియోను ప్రధాని మోడీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.


Tags: Young Girl, letter, her father, modi, twitter

Advertisement

Next Story