ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం: మోడీ

by Anukaran |   ( Updated:2020-07-10 06:13:54.0  )
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం: మోడీ
X

న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 750 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. రూ.4500కోట్లతో సోలార్ పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. సోలార్ ఎనర్జీ కేవలం ఇప్పటికే కాదు, 21వ శతాబ్ది అవసరాలను తీర్చేలా ఈ ఎనర్జీ ఉంటుందని తెలిపారు. మధ్యప్రదేశ్ క్లీన్ అండ్ చీప్ పవర్‌కు హబ్‌గా ఏర్పడుతుందన్నారు. క్లీన్ ఎనర్జీలో భారత్ ఆకర్షణీయమైన మార్కెట్‌గా అవతరిస్తున్నదని మోడీ వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం రేవా జిల్లాకే కాదు, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా 34శాతం విద్యుత్ అందుతుందని చెప్పారు. రేవాతో పాటు షాజాపూర్, నీమచ్, ఛతర్‌పూర్‌లలోనూ సోలార్ ప్లాంట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

Advertisement

Next Story