ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య ‘మైత్రి’ని ప్రారంభించిన ప్రధాని

by Shamantha N |
ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య ‘మైత్రి’ని ప్రారంభించిన ప్రధాని
X

న్యూఢిల్లీ : భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహానికి నిదర్శంగా నిలిచే ‘మైత్రి సేతు’ బ్రిడ్జీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. ఫెనీ నది మీదుగా త్రిపుర రాష్ట్రం, బంగ్లాదేశ్‌లను కలుపుతూ ఈ బ్రిడ్జీని నిర్మించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ సేతు త్రిపురలోని సబ్రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రాంగఢ్‌తో కలుపుతున్నది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ప్రజా రవాణలో సరికొత్త అధ్యాయానికి మైత్రి సేతు తెరలేపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ సేతు ‘గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్‌’గా మారనుంది. ఎందుకంటే సబ్రూమ్ నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కు చెందిన చిట్టాగాంగ్ పోర్టును చేరవచ్చు. సబ్రూమ్ నుంచి చిట్టాగాంగ్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉన్నది. మైత్రి సేతుతో పాటు ఇరుదేశాల మధ్య సరుకులు, ప్రజా రవాణాను సులభతరం చేయడానికి సబ్రూమ్‌లో నిర్మించతలపెట్టిన చెక్‌పోస్టుకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story

Most Viewed