హ్యపీ బర్త్ డే మిత్రమా..!

by Shamantha N |
హ్యపీ బర్త్ డే మిత్రమా..!
X

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగిన మిత్రమా నితీష్ కుమార్.. అందుకో శుభాకాంక్షలంటూ ప్రధాని ఆదివారం ట్వీట్ చేశారు. బీహార్ అభివృద్ధికి ముందుపడి నడిచిన పాపులర్ లీడర్‌ నితీష్ జీ… ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎన్‌డీఏ అలయెన్స్ అధికారంలో ఉన్న మొదటి రాష్ట్రం బీహార్‌యే కావడం గమనార్హం. అయితే, త్వరలో జరగనున్న రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ, జేడీయూ కూటమిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇటీవలే 243 స్థానాలకు గాను 200 సీట్లు తమ కూటమి గెలుచుకుంటుందని బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ ప్రకటించడం తెలిసిందే.

Advertisement

Next Story