జాతినుద్దేశించి మోడీ ప్రసంగం..

by Shamantha N |
జాతినుద్దేశించి మోడీ ప్రసంగం..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ శనివారం సాయంత్రం 4.30గంటలకు ప్రసగించనున్నారు. స్మార్ట్ ఇండియా హ్యకథాన్ 2020 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న మోడీ.. నూతన విద్యావిధానంపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు.

ఇదివరకు ఉన్న 10+2+3 విద్యావిధానం స్థానంలో కొత్తగా 5+3+3+4 తీసుకొచ్చిన దానికి కేంద్రం కేబినెట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ విధానం వలన మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకుంటాయని కేంద్రం భావిస్తోంది. కాగా, ఈ విద్యావిధానంపై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆహ్వానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed