- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యోగాతో బంధాలు బలోపేతం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే జరుపుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. యోగాతో కుటుంబ సభ్యుల్లో బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో యోగాకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా సాధన చేయాలన్నారు. ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గుర్తించాయని, ఇది భారతదేశ గొప్పదనం అన్నారు. ప్రాణాయామం ద్వారా శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలను సాధన చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
ఈ ప్రసంగంలో పాశ్చాత్య దేశాలకు యోగా పరిచయం చేసిన స్వామి వివేకానందను గుర్తుచేశారు. 2015లో ప్రారంభించిన యోగా దినోత్సవం మొదటిసారిగా ఈ ఏడాది ఇండ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి కారణంగా బహిరంగంగా యోగా ఉత్సవాన్ని జరుపుకోవడం లేదు. అందుకే ఈ ఏడాది యోగా డే థీమ్ ‘ఇంటివద్దే యోగా, కుటుంబంతో యోగా’గా కేంద్రం ప్రకటించింది.
కాగా, దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీఎం భుపేష్ భగేల్ మొదలు అందరూ తమతమ స్థలాల్లో యోగా చేస్తూ ఫొటోలను, అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. జవాన్లూ హిమాలయ శ్రేణుల్లో 1,800 అడుగుల ఎత్తులో యోగా చేయడం గమనార్హం. సనాతన శాస్త్రం యోగా ప్రపంచానికి భారత్ అందించిన బహుమానం అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో యోగాతో దేహాన్ని దృఢంగా ఉంచుకోవచ్చునని తెలిపారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, యోగాతో ఈ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివరించారు.