ఆ పథకం దేశ భవిష్యత్తును మార్చగలదు : క్వాల్కమ్!

by Harish |
ఆ పథకం దేశ భవిష్యత్తును మార్చగలదు : క్వాల్కమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం టెలికాం, నెట్‌వర్క్‌లలో విడిభాగాలు, టెక్ ఉత్పత్తుల కోసం మొత్తం మ్యానుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌కు దోహదపడుతుందని, ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ భవిష్యత్తును మెరుగైన స్థితిలో ఉంచుతుందని క్వాల్కమ్ ఇండియా రాజెన్ వాగాడియా చెప్పారు. ప్రభుత్వం ఇటీవల టెలికాం రంగంలో పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం స్థానిక నెట్‌వర్క్ తయారీ పరిశ్రమను పెంచడమే కాకుండా, బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలోనూ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో అపారమైన వినియోగ మార్కెట్, నమ్మశక్యం కాని స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థల ఆవిష్కరణలను నడిపించేందుకు సాంకేతిక వేదికగా భారత్ అభివృద్ధి చెందుతోందని రాజెన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ పథకం అతిపెద్ద ఉత్ప్రేరకం. ఎందుకంటే, అంతర్జాతీయ కంపెనీలు తయారీ, సరఫరా విడి భాగాల తయారీని భారత్‌లో నిర్వహించేందుకు, భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story