క్రికెటర్లు ఆటోగ్రాఫ్ ఇవ్వడంపై నిషేధం

by  |   ( Updated:2021-12-18 11:54:40.0  )
క్రికెటర్లు ఆటోగ్రాఫ్ ఇవ్వడంపై నిషేధం
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇకపై ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో క్రికెటర్లు అభిమానుల దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్స్ ఇవ్వొద్దని చెప్పింది. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు తప్పకుండా ఫ్యాన్స్‌తో దూరం పాటించాలని కోరింది. కేవలం యాషెస్‌లో ఆడుతున్న క్రికెటర్లకే కాకుండా బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో క్రికెట్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ నిక్ హాక్లీ హెచ్చరించారు. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే క్రికెటర్లకు అభిమానుల నుంచి ఆటోగ్రాఫ్‌ల డిమాండ్ వస్తుంది. కానీ వారి నుంచి దూరం పాటించాలి. వారి వస్తువులను కూడా తాకవద్దని.. కనీసం దగ్గరగా వెళ్లి ముచ్చటించడానికి కూడా ప్రయత్నించవద్దని ఆయన సూచించారు.

Advertisement

Next Story