ప్లాస్మా డోనర్స్‌కు రూ.5వేలు : సీఎం జగన్

by  |
ప్లాస్మా డోనర్స్‌కు రూ.5వేలు : సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్మా దానం చేసిన వారికి రూ. 5వేలు కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కరోనా నివారణ చర్యలపై శుక్రవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ప్లాస్మా దానం చేసిన వారికి రూ.5వేలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఉన్న కొవిడ్‌ ఆస్పత్రిల్లోని పడకల ఖాళీలు, భర్తీ వివరాలు వెల్లడించాలన్నారు.ఆస్పత్రి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ సహా పడకల ఖాళీ వివరాలు బ్లాక్‌బోర్డుపై రాయాలన్నారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీప ఆస్పత్రిలో బెడ్‌ కేటాయించాలని సూచించార. రోగులకు ఆస్పత్రిలో బెడ్‌ దొరకలేదనే పరిస్థితి రాకూడదన్నారు.

హెల్ప్‌ డెస్క్‌లో ఆరోగ్య మిత్రలను ఉంచాలని, కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. హెల్ప్‌‌డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయన్నారు. బెడ్లు, ఆహారం, శానిటైజేషన్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.


Next Story

Most Viewed