ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్

by Shyam |   ( Updated:2021-05-05 08:50:10.0  )
ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్ అర్దాంతరంగా వాయదా పడటంతో లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్లు అందరూ ఇంటి బాట పట్టారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే కమర్షియల్ ఫ్లైట్స్‌ను మే 15 వరకు బ్యాన్ చేసింది. అంతే కాకుండా ఇండియా నుంచి ఎవరూ ఆస్ట్రేలియా రావొద్దని, వస్తే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని ప్రధాని స్కాట్ మోరిస్ హెచ్చరించారు. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీక్ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే బీసీసీఐ వీరిని సురక్షితంగా ఇంటికి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అయితే బీసీసీఐ ప్లాన్ బి కూడా అమలు చేయాలని భావిస్తున్నది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను మాల్దీవులు లేదా శ్రీలంక తరలించి అక్కడి నుంచి ఆస్ట్రేలియా పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. శ్రీలంక, మాల్దీవులకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో వారిని అక్కడకు తరలించి కొన్ని రోజులు ఐసోలేషన్ అనంతరం ఆస్ట్రేలియా పంపే ఏర్పాట్లు చేస్తున్నది. అయితే క్రికెటర్లు అందరూ ఈ ప్లాన్‌కు ఒప్పుకుంటేనే అమలు చేసే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story